భూగర్భ జలాల పెంపుతో పాటు పేదలకు ఉపాధి అవకాశాలు కలిగేలా వాటర్‌షెడ్ పనులు నిర్వహించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీమ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో రెవెన్యూ, అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో వాటర్‌షెడ్ పనుల నిర్వహణపై పలు ఆదేశాలు జారీ చేశారు. పనుల పర్యవేక్షణకు జిల్లా స్థాయి కోర్‌కమిటీ అధికారులు ఈ నెల 5, 6వ తేదీల్లో వాటర్‌షెడ్‌ల నిర్మాణంపై సాంకేతిక శిక్షణ పొందాలన్నారు.
వీటి నిర్మాణానికి ఉపాధిహామీ నిధులు వినియోగించి ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్రమ్‌రెడ్డి, డీఎఫ్‌వో పురుషోత్తం, డీపీవో చంద్రమౌళి, ఆర్డీవో గణేశ్, డీఆర్డీవో సుమతి, జడ్పీ సీఈవో శిరీష, సర్వే ల్యాండ్ ఏడీ సుదర్శన్, తహసీల్దార్లు పాల్గొన్నారు.