జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో కరోనా కేసులు పెరిగిపోతుండటం వల్ల జిల్లా కలెక్టర్ పలు ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరాన్ని కంటైన్మెంట్గా ఏర్పాటు చేశారు. అదే విధంగా మహదేవపూర్లోని 1, 2, 4, 7, 9 వార్డులు, అంబట్ పల్లి, ఎలికేశ్వరం, సూరారం ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ఏర్పాటు చేశామని వెల్లడించారు.
కాళేశ్వరం వచ్చే భక్తులను, యాత్రికులను పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపేస్తున్నారు. కాళేశ్వరంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ ఉండడం వల్ల గ్రామంలోకి ఎవరూ రాకుండా, ఎవరూ బయటకు వెళ్లకుండా అధికారులు కంచెలు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: Eatala Resignation: తెరాసతో తెగతెంపులు... నేడు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా