విద్యుత్ బిల్లుల పెంపుపై జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన బాటపట్టారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సూచనలతో ట్రాన్స్‌కో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నల్ల బ్యాడ్జిలు ధరించి నినాదాలు చేశారు. అనంతరం ఏఈకి వినతిపత్రం అందించారు.
లాక్డౌన్ సమయంలో బీపీఎల్ కుటుంబాలను విద్యుత్ బిల్లుల నుంచి మినహాయించాలని.. టెలిస్కోపిక్ పద్ధతిని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. చిన్న వ్యాపారులకూ అధిక విద్యుత్ బిల్లుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.
ఇవీచూడండి: పేదల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలి: ఉత్తమ్