Congress Leaders Visited Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు, రైతులను బొమ్మారం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌తో పాటు మరో నలుగురు కాంగ్రెస్ నాయకులకు మాత్రమే మేడిగడ్డ సందర్శనకు అనుమతి ఇచ్చారు. అనంతరం పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు.
Ponnam Prabhakar Fires on CM KCR : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) విషయంలో ఇంజినీర్ అవతారం ఎత్తినట్లు చెప్పుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు నోరుమెదపడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. నాణ్యతా లోపం ఉంటే పియర్ విరిసిపోతుందా.. కచ్చితంగా ఇది డిజైన్ లోపమేనని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో హుస్నాబాద్, గౌరవెల్లి ప్రాంతానికి కోనసీమగా చేస్తానని చెప్పి.. సీఎం కేసీఆర్(CM KCR) రైతులకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం మౌనం వీడి.. ప్రజలకు వాస్తవాలను తెలపాలని డిమాండ్ చేశారు.
Medigadda Barrage Damage in Bhupalpally : రైతులతో కలిసి నాలుగు బస్సుల్లో వస్తే పోలీసులు అనుమతించలేదని.. చివరకు కొందరిని మాత్రమే అనుమతించారని ప్రభాకర్ తెలిపారు. తాము ప్రాజెక్టును సందర్శించడానికి వెళితే ఏ ఒక్క అధికారి కూడా వివరించడానికి రాకపోవడం విడ్డూరమని మండిపడ్డారు. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన కట్టడాలు ఇప్పటికీ కూడా ఏ ఒక్కటీ చెక్కుచెదరలేదని గుర్తు చేశారు. ప్రతి చిన్న విషయానికి ట్విటర్లో స్పందించే కేసీఆర్ కుటుంబ సభ్యులు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై, నిర్మాణాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని.. వాస్తవాలను ఎందుకు బయటపెట్టడం లేదన్నారు.
"కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీఎం కేసీఆర్‌నే స్వయంగా ఇంజినీర్‌గా అవతారం ఎత్తి ప్రాజెక్టు నిర్వహణను చూసుకున్నారు. మంచి అయితే వాళ్లు చెడు అయితే ప్రతిపక్షాలపై నెట్టేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ, గతంలో మునిగిపోయి పంపు హౌస్‌లపై ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఇది ప్రభుత్వ వైఫల్యంగా భావిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి." - పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేత
Police Stop Ponnam Prabhakar and Congress Leaders : ప్రాజెక్టు డిజైన్‌కు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రజలకు ఎందుకు ప్రభుత్వం వివరించడం లేదని.. బీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఎందుకు కూలిపోతున్నాయని దుయ్యబట్టారు. ఈ విషయాలను ప్రజలు గమనించాలని కోరారు. ప్రాజెక్టు పేరుతో విహార యాత్రలు, సందర్శనలకు అనుమతించిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు సందర్శనకు అనుమతించడం లేదన్నారు. అక్కడకు వెళ్లే వారిని ఎందుకు పోలీసులను అడ్డుపెట్టి అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. నిర్మాణం జరిగినప్పుడు ఫోజులు ఇచ్చిన నాయకులు ఈరోజు ఎందుకు నోరు విప్పడం లేదని పొన్నం ప్రభాకర్ అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ ప్రమాద తీవ్రతను చూడడానికి నాలుగు బస్సుల్లో కాంగ్రెస్ నాయకులు, రైతులు తరలివచ్చారు. అయితే పోలీసులు మాత్రం వారిలో నలుగురికి మాత్రమే అనుమతి ఇచ్చారు.
Medigadda Barrage in Bhupalpally : "మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో లోపాలు లేవు.. కానీ?"