ETV Bharat / state

రక్తదానం ప్రాణదానంతో సమానం: కలెక్టర్​ ​

రక్తదానం ప్రాణదానంతో సమానమని పాలనాధికారి మహమ్మద్​ అబ్దుల్​ అజీమ్​ పేర్కొన్నారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా గొర్లవీడులో హెల్పింగ్​ హ్యాండ్స్​ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ​

Collector Mohammad Abdul Azim inaugurated the blood donation camp
రక్తదానం ప్రాణదానంతో సమానం: కలెక్టర్​ ​
author img

By

Published : Oct 23, 2020, 7:52 PM IST

రక్తదానం ప్రాణదానంతో సమానమని.. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం గొర్లవీడులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో గ్రామానికి చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన యువకులను అభినందించారు. వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు.

మరో ప్రాణం కాపాడవచ్చు..

ప్రమాదాలు జరిగినప్పుడు రక్తస్రావం కావడం వల్లే 90 శాతం మరణాలు సంభవిస్తున్నాయని కలెక్టర్​ పేర్కొన్నారు. అలాంటి బాధితులకు సకాలంలో రక్తం అందిస్తే ప్రాణాలు నిలబడతాయని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు రక్తదానం చేయడం వల్ల మరో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వారవుతారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా బ్లడ్ స్టోరేజీ బ్యాంకును ఏర్పాటు చేసేందుకు చర్యలు జరుగుతున్నాయన్నారు.

హెల్పింగ్ హ్యాండ్స్​ స్వచ్ఛంద సంస్థ సభ్యులు చేస్తున్న సామాజిక కార్యక్రమాలను చూసి.. ఈ కార్యక్రమానికి వచ్చినట్లు కలెక్టర్​ వివరించారు. గొర్లవీడు గ్రామ అభివృద్ధికి హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు చేస్తున్న సేవలకు ప్రభుత్వం సహకరిస్తుందని.. త్వరలోనే గ్రామసభ నిర్వహించి గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అంతర్జాతీయ సేవా పురస్కారాన్ని పొందిన కలెక్టర్​ను స్వచ్ఛంద సంస్థ సభ్యులు, గ్రామస్థులు సన్మానించారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శంకరన్న, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ ప్రధాన్, హెల్పింగ్ హ్యాండ్స్​ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు గౌతం కృష్ణ, సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇవీచూడండి: నష్టానికి సంబంధించి సమగ్ర నివేదిక అందలేదు: కేంద్రబృందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.