జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారం గ్రామంలో ఈనెల 6న రేవల్లి రాజబాబు దారుణ హత్యకు గురయ్యాడు. ఇలాంటి ఘటనలను ఖండిస్తూ ఈ నెల 26న ఛలో మల్లారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు దండు రమేశ్ కొయ్యూరు మీడియా సమావేశంలో తెలిపారు. 2014 సంవత్సరం తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాతి నుంచే మంథని నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీలపై అరాచకాలు పెరుగుతున్నాయన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో మల్లారం కార్యక్రమాన్ని ఎలాగైనా ఆపేయాలని తెరాస కుట్ర చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గంలో చనిపోయిన వారికి తెరాస పార్టీ ఎలాంటి సహాయం చేయలేదని.. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీలను ఆదుకోలేదన్నారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని మల్హర్ మండలంలో 144 సెక్షన్ విధించడం సబబు కాదని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఛలో మల్లారం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని స్పష్టం చేస్తూ గోడ పత్రికను ఆవిష్కరించారు.

ఇదీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?