జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారం గ్రామంలో ఇటీవల హత్యకు గురైన రేవెల్లి రాజబాబు కుటుంబాన్ని జడ్పీ ఛైర్పర్సన్ శ్రీహర్షిని రాకేశ్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని, మృతుడి పిల్లలను ఇంటర్మీడియట్ వరకు తన సొంత ఖర్చుతో చదివిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రాజబాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
రేవెల్లి రాజబాబును హత్యచేసి దుండగులకు కఠినశిక్ష పడేలా చూస్తానని జడ్పీఛైర్పర్సన్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు శ్రీధర్ బాబు, అతని అనుచరులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఎస్సీ,ఎస్టీ సోదరుల శవాలతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాజబాబు కుటుంబానికి తెరాస ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాజబాబు హత్యతో సంబంధమున్న తెరాస వార్డ్మెంబర్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
- ఇదీ చూడండి: జీవనశైలిలో మార్పులు తెచ్చిన కరోనా