వ్యవసాయం దండగ కాదు... పండుగ అని ముఖ్యమంత్రి కేసీఆర్ నిరూపిస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగే, జూకల్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో అదనపు గదులకు శంకుస్థాపన చేశారు. అనంతంరం జూకల్ నిర్వహించిన నియంత్రిత వ్యవసాయ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు.
ఉన్నత చదువులు చదువుకున్న చాలా మంది వ్యవసాయం వైపు ఇప్పుడు మొగ్గు చూపుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. సాగునీరు, ఉచిత విద్యుత్, పంట పెట్టుబడి, రుణ మాఫీ, విత్తనాలు, ఎరువులు, గిట్టుబాటు ధర కల్పించడం వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం చేపడుతోందన్నారు. మూస పద్ధతిలో కాకుండా... ప్రభుత్వ సూచనల మేరకు పంటలు సాగు చేసి, అధిక లాభాలు పొందాలని రైతులకు సూచించారు.
ఇదీ చూడండి: మిడతల దండుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష