జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరిలో 'భూ పరిష్కార వేదిక.. రైతుల వద్దకే రెవెన్యూ సిబ్బంది ' అనే పేరుతో వినూత్న కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఇతర రెవెన్యూ అధికారులు హాజరయ్యారు. జిల్లాలో 93 శాతం డిజిటల్ సంతకాలు చేశామని, మిగతా 7 శాతం వివిధ సమస్యల వల్ల ఆలస్యమవుతోందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరుగుతూ రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. అలాంటి వారి సమస్యలు పరిష్కరించేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని కలెక్టర్ తెలిపారు.
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ కథనానికి స్పందించిన తుంగతుర్తి ఎమ్మెల్యే