ప్రతి పేదింటి ఆడబిడ్డకు ఒక అన్నలా, కొడుకులా పుట్టింటి కానుకగా బతుకమ్మ చీరలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. ప్రతి గ్రామంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు బతుకమ్మ చీరలు అందిస్తున్నామని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక, లింగాల గ్రామాల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. రేగొండ మండలానికి సుమారుగా 21వేల బతుకమ్మ చీరలు వచ్చాయని... ప్రతి ఒక్క మహిళ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు.
అనేక లాభాలు...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు జరిగాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక లాభాలు పొందుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'పండుగ రోజు ప్రతిఒక్కరు బతుకమ్మ చీర ధరించాలి'