ETV Bharat / state

అన్నారం పంప్​హౌస్​కు 'ముంపు' ముప్పు తప్పేలా.. - repairs to annaram pump house

భారీ వరదల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అన్నారం పంపుహౌస్‌కు ఇటీవల జరిగిన నష్టం పునరావృతం కాకుండా అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే గ్రావిటీ కాలువ పైభాగంలో మట్టికట్ట స్థానంలో సిమెంటు కాంక్రీటు నిర్మాణం పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలను నీటి పారుదల శాఖ అధికారులకు పంపినట్లు సమాచారం.

ముంపు ముప్పు తప్పేలా..
ముంపు ముప్పు తప్పేలా..
author img

By

Published : Dec 8, 2022, 8:05 AM IST

గోదావరికి గత జులైలో వచ్చిన భారీ వరద కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అన్నారం పంపుహౌస్‌కు జరిగిన నష్టం పునరావృతం కాకుండా నీటి పారుదల శాఖ కసరత్తు ప్రారంభించింది. మొదటి పంపుహౌస్‌ కన్నెపల్లి నుంచి ఎత్తిపోసే నీరు అన్నారం బ్యారేజిలో చేరేందుకు నిర్మించిన కాలువ అనేక చోట్ల దెబ్బతింది. దాన్ని బాగు చేయడంతో పాటు అన్నారం పంపుహౌస్‌ మళ్లీ నీట మునగకుండా మట్టికట్ట స్థానంలో సిమెంటు కాంక్రీటు నిర్మాణం తదితర పనులు చేపట్టాలని నిర్ణయించిన ఇంజినీర్లు ప్రతిపాదనలను నీటిపారుదల శాఖ అధికారులకు పంపినట్లు తెలిసింది. డిజైన్లలో లోపాలను సవరించి మళ్లీ ఇలాంటి సమస్యలు రాకుండా సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌(సీడీఓ)కు తాజాగా ప్రతిపాదనలు అందజేసినట్లు తెలిసింది.

....

కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా మొదటి పంపుహౌస్‌ను కన్నెపల్లి వద్ద నిర్మించగా, దీని నుంచి ఎత్తిపోసే నీరు అన్నారం బ్యారేజికి చేరేందుకు నిర్మించిన కాలువ గత జులైలో భారీ వరద కారణంగా 24చోట్ల దెబ్బతిన్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. పనుల్లో నాణ్యతలోపాలు, డిజైన్‌లో సమస్యలు దీనికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదొక ఎత్తయితే, వచ్చే సీజన్‌లో మళ్లీ నీటిని ఎత్తిపోయాలంటే ఈ కాలువ మరమ్మతును సత్వరం పూర్తిచేయాల్సి ఉంటుంది. లేకపోతే వచ్చే వర్షాకాలంలో మరింత దెబ్బతినే అవకాశం ఉంది. సీడీఓ పరిశీలన తర్వాత ఇందుకు ఎంత ఖర్చవుతుందన్న అంశంపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. రక్షణగా వేసిన మట్టికట్టపై నుంచి నీరు లోపలకు ప్రవేశించడం, కట్ట కోతకు గురికావడం తదితరాలతో పాటు గరిష్ఠ వరద మట్టం కంటే తక్కువ ఎత్తులో ఉండటం వంటి కారణాల వల్ల అన్నారం పంపుహౌస్‌ నీట మునిగింది.

ఈ నీటిని తోడి పంపులను బయటకు తీసి, నాలుగింటికి మరమ్మతుల అనంతరం ప్రయోగాత్మకంగా నీటిని విడుదల చేశారు. మిగిలిన పంపులు నడపాల్సి ఉంది. మరోవైపు 2023లో మళ్లీ భారీ వరద వస్తే సమస్య తలెత్తకుండా పంపుహౌస్‌కు రక్షణగా సిమెంటు కాంక్రీటు(సీసీ) గోడను నిర్మించాలని నిర్ణయించారు. సుమారు 800 మీటర్ల పొడవునా నిర్మించే ఈ గోడను 134 మీటర్ల మట్టం వరకు నీరొచ్చినా ఇబ్బంది లేకుండా కట్టాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇది కూడా నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ కార్యాలయానికి చేరినట్లు తెలిసింది. పంపుహౌస్‌ ప్రెషర్‌మెయిన్‌లు నీళ్లలో మునిగి ఉండటంతో పాటు వాటిపైన మట్టి కూడా ఉన్నట్లు సమాచారం. దీనివల్ల ఏమైనా నష్టం వాటిల్లే అవకాశముందా అన్నదానిపై నిపుణులతో అధ్యయనం చేయించినట్లు తెలిసింది. ట్రాన్స్‌కో సైతం కొన్ని పనులు చేయాల్సి ఉంది. రూ.25కోట్లు చెల్లిస్తే కానీ ఇవి పూర్తిచేయలేని పరిస్థితి ఉండటంతో ఈ మొత్తం సమకూర్చడానికి నీటిపారుదల శాఖ నుంచి ప్రతిపాదనలు వెళ్లినట్లు తెలిసింది. అన్ని పంపులు పూర్తిస్థాయిలో నడవాలంటే ట్రాన్స్‌కో కూడా కొన్ని పనులు పూర్తిచేయాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి.

ఇవీ చూడండి..

సింగరేణి బొగ్గుగనుల వేలంపై లోక్‌సభలో మాటలయుద్ధం

మేకిన్ ఇండియా పోయి ఊరూరా చైనా బజార్‌లొచ్చాయ్.. మోదీపై కేసీఆర్ సెటైర్స్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.