జిల్లాలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎన్నికలను నిర్వహించాలని... జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. జిల్లా కేంద్రంలోని సింగరేణి ఇల్లందు క్లబ్ హౌస్లో సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభించి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఎన్నికల సంఘం గుర్తించిన గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి కలిగి ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసేందుకు అనుమతించాలని పేర్కొన్నారు.
ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే జిల్లా ఎన్నికల అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. జిల్లాలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు లేకపోయినప్పటికీ... ముందు జాగ్రత్తగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొవిడ్ నిబంధనలను అన్ని పోలింగ్ కేంద్రాల్లో తప్పకుండా అమలు చేయాలని అన్నారు.
ఇదీ చదవండి: నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలకు పూర్తైన ఏర్పాట్లు