జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఏఎన్ఎమ్లు నిరసన బాట పట్టారు. పీహెచ్సీలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఉమాదేవి తమను వేధింపులకు గురిచేస్తుందన్నారు. చెప్పినట్టు వినకుంటే గుంజీలు తీయిస్తూ.. బెంచీల కింద కూర్చోబెడుతుందని ఆరోపిస్తున్నారు. వెంటనే ఉమాదేవిపై చర్యలు తీసుకోవాలని అంబేడ్కర్, జయశంకర్ విగ్రహాల వద్ద ఏఎన్ఎమ్లు మూతికి నల్లగుడ్డ కట్టుకుని ఆందోళనకు దిగారు.
ఇవీ చూడండి: ముంబయిలో 45ఏళ్ల వర్షపాతం రికార్డ్ రిపీట్!