జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గరిమెళ్లపల్లిలో కరోనా కలకలం రేపుతోంది. ఒక్కరోజే 16 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. ప్రస్తుతం వీరంతా హోంక్వారంటైన్‌లో ఉన్నట్లు వైద్యాధికారి సంపత్ కుమార్ తెలిపారు.
కొవిడ్ కేసులు పెరగటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే కేసులు పెరుగుతున్నాయని వైద్య అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 8 వేలు దాటిన కరోనా క్రియాశీల కేసులు