సర్పంచ్‌లకు శిక్షణ తరగతులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు ప్రభుత్వం శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. సర్పంచ్ బాధ్యతలపైవివిధ శాఖలకు చెందిన నిపుణలు శిక్షణ ఇస్తున్నారు. జనగామ జిల్లాలోని 301 గ్రామపంచాయతీల సర్పంచ్‌లకు మూడు విడతలుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణ పూర్తైన అనంతరం వారికిసర్టిఫికెట్లు అందజేస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి రవి కుమార్ తెలిపారు.
సర్పంచ్‌గా ఎన్నికైన అనంతరం బాధ్యతలు ఎలా నిర్వహించాలో తెలియక సతమతం అయ్యామని సర్పంచ్లన్నారు.
ఆదర్శగ్రామాలుగా మారుస్తాం..!
ఈ శిక్షణ తరగతులతో ప్రతి పనిపై అవగహన ఏర్పడిందని తమ గ్రామాలను ఆదర్శ గ్రామలుగా తీర్చిదిద్దడానికి ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడుతాయని నూతన సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి:డేటా ఎక్కడిది?