సీసీ కెమెరాల సాయంతో నేరగాళ్లను గుర్తించడం సులభతరంగా ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ అన్నారు. ఒక్కో నిఘా నేత్రం వందమంది పోలీసులతో సమానమని తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంతో పాటు, రఘునాథపల్లి, నర్మెట్ట, తరిగొప్పుల మండలాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన 350 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు.
నర్మెట్ట మండలంలోని గుంటూరుపల్లిలో గత 3 ఏళ్ల నుంచి ఒక్క కేసు నమోదు కాలేదని తెలియడంతో గ్రామస్థులను పోలీస్ కమిషనర్ అభినందించారు. ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామం.. నేర రహిత గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వివిధ సంఘాల ప్రతినిధులను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ వినోద్, సిఐలు బాలాజీ, సంతోశ్, మల్లేశ్ ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: స్వచ్ఛ నగరంగా భాగ్యనగరం : మంత్రి కేటీఆర్