జనగామ జిల్లాలో రోజురోజుకు కరోనా మహమ్మారి విస్తరిస్తున్నందున ప్రజలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు. ఎప్పుడు రద్దీగా ఉండే జిల్లా కేంద్రంలోని రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. జిల్లాలో లాక్డౌన్ సడలింపులతో జన సంచారం పెరిగి, అన్ని దుకాణాలు తెరుచుకోగా, గత వారం రోజుల నుంచి జిల్లాలో కొవిడ్ కేసులు రోజురోజుకు పెరగడం వల్ల ప్రజలు తిరిగి స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు.
అత్యవసరం అయితే తప్ప బయటకు రావడానికి మొగ్గు చూపడం లేదు. ఇప్పటికే బంగారు, వస్త్ర దుకాణ యజమానులు, నాయి బ్రాహ్మణులు సమావేశమై ఈ నెల 30 వరకు దుకాణాలు తెరవడం లేదని ప్రకటించగా.. గృహోపకరణాలు తదితర దుకాణాలు కూడా తెరవడం లేదు. నిత్యావసర సరుకుల దుకాణాలు మాత్రం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరుస్తున్నారు.