జనగామ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో వద్ద మహిళా ఆర్టీసీ కార్మికులు దీక్షా శిబిరంలో కూర్చొని నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మికులు రైల్వేస్టేషన్ నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు అర్ధనగ్నంగా ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. 20 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్మికులకు తెలుగు యువత సంఘీభావం తెలిపింది.
ఇవీ చూడండి: ఆర్టీసీ ఎవరి జాగీరు కాదు: అశ్వత్థామరెడ్డి