ETV Bharat / state

జనగామ జిల్లాలో ట్రంప్ జన్మదిన వేడుకలు

జనగామ జిల్లాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జన్మదినాన్ని ఓ వ్యక్తి ఘనంగా నిర్వహించాడు. విగ్రహం ఆవిష్కరించి ట్రంప్​పై అభిమానాన్ని చాటుకున్నాడు.

ట్రంప్ జన్మదినం సందర్భంగా గ్రామస్థులకు అన్నదానం
author img

By

Published : Jun 15, 2019, 7:59 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జన్మదిన వేడుకలు జనగామ జిల్లా కొన్నెలో ఘనంగా జరిగాయి. ఓ వ్యక్తి ఏకంగా ఆరడుగుల ట్రంప్ విగ్రహం నెలకొల్పి అభిషేకాలు చేశారు. గత మూడేళ్లుగా ట్రంపుపై అభిమానంతో పూజలు చేసి, చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహిస్తానని గ్రామానికి చెందిన బుస కృష్ణ తెలిపారు. ట్రంప్ జన్మదినం సందర్భంగా గ్రామస్థులకు అన్నదానం చేశారు. భారత్​, అమెరికాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని కృష్ణ ఆకాక్షించారు. ట్రంపు ముక్కుసూటితనం దుందుడుకు స్వభావం తనకు నచ్చుతాయని తెలిపారు.

ట్రంప్ జన్మదినాన విగ్రహం ఆవిష్కరించి ట్రంప్​పై అభిమానాన్ని చాటుకున్నాడో అభిమాని

ఇవీ చూడండి : "వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయాడు"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.