ETV Bharat / state

Tension At Jangaon : జనగామలో మరోసారి ఉద్రిక్తత.. కర్రలతో కొట్టుకున్న తెరాస, భాజపా కార్యకర్తలు - జనగామ జిల్లా వార్తలు

Tension At Jangaon : జనగామ జిల్లాలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. నర్మెట్ట మండలంలో భాజపా, తెరాస శ్రేణులు పరస్పరం కర్రలతో కొట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు.

Tension at jangaon
Tension at jangaon
author img

By

Published : Feb 10, 2022, 5:36 PM IST

Tension in Jangaon : జనగామలో మరోసారి ఉద్రిక్తత.. కర్రలతో కొట్టుకున్న తెరాస, భాజపా కార్యకర్తలు

Tension At Jangaon : జనగామ జిల్లాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న తెరాస కార్యకర్తల దాడికి నిరసనగా భాజపా కార్యాలయంలో మౌనదీక్ష చేపట్టారు. జనగామ ప్రధాన కూడలిలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు ర్యాలీగా వెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా వారిని అడ్డుకుని పార్టీ కార్యాలయానికి తరలించారు. అక్కడే ఉన్న తెరాస కార్యకర్తలు అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడానికి యత్నించగా పోలీసులు వారించారు.

భాజపా కార్యాలయంలో చేపట్టిన మౌనదీక్షను భగ్నం చేసి కార్యకర్తలను జిల్లాలోని వివిధ పోలీస్​ స్టేషన్లకు తరలించారు. నర్మెట్ట మండల చౌరస్తాలో భాజపా, తెరాస కార్యకర్తలు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. గాయపడినవారిని జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ గొడవ..

ఆంధ్రప్రదేశ్​ విభజనపై పార్లమెంట్​లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. తెరాస, కాంగ్రెస్ పార్టీలు భాజపాపై విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం.. జనగామ చౌరస్తాలో కాంగ్రెస్, తెరాస ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని భాజపా శ్రేణులు అడ్డుకోవటంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు పార్టీల శ్రేణులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. తెరాస, భాజపా శ్రేణులు పోటాపోటీ నినాదాలు చేసుకున్నాయి. సహనం కోల్పోయిన భాజపా, తెరాస కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

ఇదీచూడండి: తెరాస, భాజపా శ్రేణుల మధ్య ఘర్షణ.. కర్రలతో కొట్టుకున్న కార్యకర్తలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.