పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సైనికుల కుటుంబాలకు మనోధైర్యం కలిగించేందుకు స్మృతి దినం నిర్వహించామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. జనగామలో అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమర జవాన్లకు నివాళులు అర్పించారు.
కొవ్వొత్తులు వెలిగించి.. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న సైనికులపై కృతజ్ఞతతో మెలగాలని సూచించారు.