ప్రైవేటు యూనివర్సిటీలను ఏర్పాటు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ను వెంటనే రద్దు చేయాలని జనగామ జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు అభినయ్ గౌడ్ డిమాండ్ చేశారు. సర్కారు నిర్ణయాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ గెజిట్‌తో పేద విద్యార్థులు, నాన్ గెజిటెడ్ లెక్చరర్లు తీవ్రంగా నష్టపోతారన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు ఎంబీబీస్ విద్య అందని ద్రాక్షగా చేశారని మండిపడ్డారు.