గొర్రెల, మేకల పెంపకదారుల సమస్యలను పరిష్కరించాలని ఇవాళ ఛలో అసెంబ్లీకి రాష్ట్ర సంఘం పిలుపునిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్కు బయలుదేరిన వారిని జనగామ జిల్లా పెంబర్తి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండో విడత గొర్రెల పంపిణీలో డీడీలు తీసిన వారికి ఇంత వరకు అందించడం లేదని వాపోయారు. వెంటనే గొర్రెల పంపిణీని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గొల్లకురుమల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీచూడండి: కాంగ్రెస్లో ఏం జరుగుతుందో..!