తెరాసకు భయం అంటే ఏంటో చూపిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. పోలీసుల లాఠీఛార్జీలో గాయపడిన జనగామ పట్టణ అధ్యక్షుడు పవన్‌శర్మను సంజయ్ పరామర్శించారు. ముందుగా జనగామకు చేరుకున్న సంజయ్.. చౌరస్తా నుంచి ఆస్పత్రికి ర్యాలీగా వెళ్లారు. కార్యకర్తలను కొట్టిన పోలీసులను సస్పెండ్ చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు.
"పోలీసులకు మేము వ్యతిరేకం కాదు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు కావడం లేదు. దాడి చేసిన పోలీసులపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలి. పోలీసులపై చర్యలు తీసుకోకపోతే భారీ ఆందోళనకు దిగుతాం. భాజపాను అణచివేయాలని సీఎం చూస్తున్నారు. భాజపా కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు."
- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి :
జనగామ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత