నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను వెంటనే నిలిపేసి పర్యావరణాన్ని రక్షించాలని తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరాం డిమాండ్ చేశారు. జనగామలో తెలంగాణ విద్యావంతుల వేదిక నిర్వహించనున్న 'నల్లమలను రక్షించుకుందాం' నిరసన కార్యక్రమ గోడపత్రికను కోదండరాం ఆవిష్కరించారు. యురేనియం తవ్వకాల వల్ల రేడియోధార్మిక కిరణాలు వెలువడి పర్యావరణం కలుషితం కావటంతో పాటు ప్రజలు కాన్సర్ లాంటి వ్యాధుల బారిన పడుతారని వివరించారు. తక్షణమే యురేనియం తవ్వకాలను నిలిపేసి పర్యావరణాన్ని కాపాడాలని కోదండరాం డిమాండ్ చేశారు.
ఇదీచూడండి: బాబ్రీ కేసులో కల్యాణ్సింగ్పై విచారణకు సీబీఐ సిద్ధం!