వేముల గంగాభవాని అనే విద్యార్థిని పాము కాటుకు బలైంది. ఇటీవలే విడుదలైన పదో తరగతి ఫలితాలలో ఉత్తీర్ణురాలైంది. ఉన్నత చదువులు చదివించాలనుకున్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోయాయి. వారి రోదనలు గ్రామస్థులను కలిచివేశాయి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన వేముల అయిలయ్య, సుజాత అంజమ్మ దంపతులు... లింగాలఘన్‌పూర్ మండలం కొత్తపల్లిలో నివాసం ఉంటున్నారు.
మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులంతా ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గంగాభవాని పాముకాటుకు గురైంది. జనగామ ఏరియా ఆసుపత్రికి కుటుంబ సభ్యలు తరలించగా పరిశీలించిన వైద్యులు బాలికను ఎంజీఎం తీసుకెళ్లాలని సూచించారు. ఆస్పత్రికి మార్గమధ్యలో మృతి చెందింది.
ఇదీ చదవండి: హరితహారానికి 'ఆరో' మెట్టు.. రేపు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్