ETV Bharat / state

హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌.. వృద్ధులకో వరం - జనగామలో వృద్ధుల పాలిట వరంగా మారిన హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్

నిన్నటివరకూ.. కాలూ చేయి కదపలేని స్థితిలో మంచం పట్టిన వృద్ధులు వాళ్లంతా. నేడు ఉత్సాహం ఉరకలేసే పిల్లలుగా మారారు. ఏడు పదుల వయసులోనూ ఆడిపాడుతున్నారు. కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. వ్యాయామాలతో వార్థక్యానికి కొత్త భాష్యం చెబుతున్నారు. జీవితం అంతా అయిపోయిందనే నిరుత్సాహం నుంచి సంతోషంగా గడుపుతున్నారు. మాధవి నీకు థ్యాంక్స్‌ అంటూ బోసినవ్వులు చిందిస్తున్నారు.

వృద్ధుల పాలిట వరం.. ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌!

author img

By

Published : Feb 5, 2021, 1:41 PM IST

Updated : Feb 6, 2021, 2:21 PM IST

హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌.. వృద్ధులకో వరం

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌లో భాగమైన యాక్టివ్ యల్డర్లీ ఏజింగ్ సెంటర్ ఇది. ఇక్కడి వృద్దులను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. వారిలో ఉరకలేసే ఉత్సాహమే అందుకు కారణం. వ్యాయామం, ధ్యానం చేస్తూ ఏకాగ్రత పొందుతున్నారు. అలుపూ ఆయాసం లేకుండా ఆటపాటల్లో మునిగితేలుతున్నారు. కట్టె తిప్పి సాము చేస్తూ.. యువకులకు ఏం తక్కువ కాదని నిరూపిస్తున్నారు.

వృద్ధుల పాలిట వరం

2018లో ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రారంభమైన యాక్టివ్ యల్డర్లీ ఏజింగ్ సెంటర్ వయోవృద్ధుల పాలిట వరంగా మారింది. ప్రారంభంలో రావడానికి ఎవరూ ఇష్టపడలేదు. ఆశావర్కర్లు ఇల్లిల్లూ తిరిగి వృద్ధులకు అవగాహన కల్పించారు. క్రమంగా పెద్దవాళ్ల రాక మొదలైంది. తొలుత 5 గురితో మొదలై ఆ తరువాత 180 మంది వరకు చేరింది. ఒంటరితనం అనుభవించే పండుటాకులు అప్యాయంగా పలకరించుకొని కుంగుబాటును పోగొట్టుకుంటున్నారు.

మళ్లీ కళకళ

కరోనా మహమ్మారి వల్ల తాత్కాలికంగా సేవలు నిలిపివేశారు. వృద్ధుల ఆలనా పాలనా చూసుకునేవాళ్లు లేకుండా పోయారు. ఎంతో మంది ఆకలితో అలమటించారు. ఆ సమయంలో దాతల సాయంతో ఇంటింటికీ వెళ్లి పళ్లూ...నిత్యావసర సరుకులు అందించి ఆశావర్కర్లు సహృదయతను చాటారు. మహమ్మారి తగ్గుముఖం పట్టగా ఈ కేంద్రం మళ్లీ కళకళలాడుతోంది.

వృద్ధులకు మానసిక ఉల్లాసమే కాకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రక్తపోటు, మధుమేహానికి ఉచితంగా మందులు అందజేస్తున్నారు. రాష్ట్రంలోని 51 కేంద్రాల్లో అన్ని రకాల సేవలందిస్తూ ఈ కేంద్రం విజయవంతంగా నడుస్తోంది.

మాధవి అంటే ప్రత్యేక అభిమానం

వీళ్లందరి బాగోగులు చూసేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన ఆశావర్కర్ మాధవి అంటే... వృద్ధులందరికీ ప్రత్యేక అభిమానం. కోడలు...బిడ్డా...అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటారు. అత్యుత్తమ సేవలందిస్తున్న ఆశావర్కర్ మాధవి పురస్కారం పొందారు. కొత్త జీవితం ప్రారంభించిన వృద్ధులు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌లో సేద తీరుతున్నారు. ఆశావర్కర్‌ మాధవి సేవలకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆమె చల్లగా ఉండాలని దీవిస్తున్నారు.

ఇదీ చదవండి: ఎంసెట్‌లో 'ఇంటర్‌ వెయిటేజీ' కొనసాగించాలా? వద్దా?

Last Updated : Feb 6, 2021, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.