జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన శాతపురం అనిల్ గతంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు చచ్చుబడి మంచానికే పరిమితమయ్యాడు. వాలీబాల్ క్రీడాకారుడిగా జట్టుకు ఎన్నో విజయాలు అందించిన అనిల్ వ్యథపై ఈటీవీలో వచ్చిన కథనానికి ఓ సామాజిక కార్యకర్త స్పందించారు.
సామాజిక కార్యకర్త వేదవల్లి చంద్రప్రకాష్... బాధితుడికి రూ.5వేలు ఆర్థిక సాయం చేశారు. తన పరిస్థితి చూసి ఆర్థికంగా అండగా నిలిచిన చంద్రప్రకాష్కు... అనిల్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: ఒకప్పుడు ఆటలో మేటి.. విధి వక్రించి బతుకు భారమైంది!