గులాబీ మొక్కంటే మూడు, నాలుగు అడుగుల ఎత్తు ఎదగటం.. పదో పదిహేనో పూలు పూయటం సహజమే.. కానీ, జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగారంలో బండారి వెంకన్న ఇంటి ముందున్న గులాబీ మొక్క ఏకంగా ఏడడుగులు పెరిగింది. అంతేనా.. ఏకకాలంలో వందకుపైగా పూలు పూస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది. మంచుతో కూడిన చల్లటి సానుకూల వాతావరణం, సేంద్రియ ఎరువు వాడడంతో ఇలా గులాబీలు విరగపూశాయని వరంగల్ ఉద్యాన శాఖ అధికారి సుద్దాల శంకర్ తెలిపారు.
- ఇదీ చూడండి : వాడిన పూలు వికసించెనే.. పడతి ప్రగతికి సహకరించెనే...