జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తెల్లవారుజామున నిద్రలేచిన యువతులు ఇంద్రధనస్సు నేలకు దిగి వచ్చిందా అన్నట్లుగా... ముత్యాల ముగ్గులతో నేలతల్లిని అందంగా అలంకరించారు.
మహిళలు గొబ్బెమ్మలను గుమ్మడి పూలతో అలంకరించి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేశారు. డూడూ బసవన్నల విన్యాసాలు, భోగభాగ్యాల భోగి మంటలతో పెద్ద పండుగ స్టేషన్ ఘనపూర్లో కొలువుదీరింది.
ఇదీ చదవండి: శబరిలో తిరువాభరణాల ఉత్సవం.. అద్భుతం.. అనిర్వచనీయం!