ETV Bharat / state

ఆ గుడిలో అర్చకుడే దేవుడు - పూజారిని పూజిస్తున్న ఆ గ్రామం ఎక్కడుందో తెలుసా?

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 3, 2024, 2:15 PM IST

Priest is The God in Jangaon Temple : అభిమాన నాయకులకు, నటులకు ఆలయం కట్టడం చూశాం. దేవుడికి గుడి కట్టడం చూశాం. పూజారికి గుడి కట్టడం ఎక్కడైనా చూశారా? జనగామ జిల్లా తాటికొండ గ్రామంలో ప్రజలంతా అభిమానంతో ఓ అర్చకుడికి గుర్తుగా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి గుడికి తుదిమెరుగులు దిద్దే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనెల 4వ తేదీన విగ్రహ ప్రతిష్ఠాపన ఘనంగా చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. మరి ఆ గుడి కథేంటో తెలుసుకుందామా?

Sri Rangacharya Served Priest, Ayurvedic Doctor
Villagers Build Temple For A Priest In Jangaon
ఉచితంగా వైద్య సేవలందించిన పూజారి -మరణాంతరం విగ్రహం కట్టిస్తున్న గ్రామస్థులు

Priest is The God in Jangaon Temple : జనగామ జిల్లా తాటికొండ గ్రామంలో అర్చకుడిగా, ఆయుర్వేద వైద్యుడిగా విశేష సేవలందించేవారు శ్రీరంగాచార్యులు. గత ఏడాది శ్రీరంగాచార్యులు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ పెద్దాయన లేని లోటు మరిచిపోలేకపోయారు గ్రామస్థులు. గుండెల్లో నిలిచిన అభిమానంతో పూజారి విగ్రహం తయారు చేయించారు. పూజారి కుటుంబ సభ్యులతో కలసి తాము కూడా చందాలేసి ఆరు లక్షల వ్యయంతో గుడి నిర్మిస్తున్నారు.

ఆ పూజారిని దేవుడిలా కొలుస్తున్న జనం

Villagers Build Temple For A Priest In Jangaon : శ్రీరంగాచార్యులు గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో 50 ఏళ్లుగా పూజలు నిర్వహించారు. దీంతో పాటు పరిసర గ్రామాల్లో పౌరోహిత్యం, ఆయుర్వేద వైద్యుడిగానూ వివిధ రకాల రుగ్మతలకు ఉచితంగా మందులు ఇస్తూ ప్రజలకు ఎనలేని సేవలందించారు. అనేక రకాలుగా సేవలు అందించిన అయ్యగారు మరణించడం కుటుంబ సభ్యులనే కాదు గ్రామస్తులను కలచి వేసింది. మళ్లీ ఆయన్ని సజీవంగా చూడాలనుకున్న గ్రామస్థులంతా గుడి కట్టాలని నిర్ణయించుకున్నారు.

"ఒక అర్చకుడికి ఆలయం కట్టించడం ఇదే తొలిసారి. మా నాన్న ఎన్నో సేవలు అందించారు కాబట్టే గ్రామస్థులంతా గుడి కట్టాలనుకుంటున్నారు. చుట్టు ప్రక్కల 20 గ్రామాలు, తండాలతో సహా స్టేషన్​ ఘన్​పూర్​ పల్లెలకు సేవలందించారు. హైదరాబాద్​లో కూడా నాన్న పని చేశారు. ఈనెల 4న ఆయన వర్దంతి రోజున విగ్రహ ప్రతిష్ట చేస్తున్నాం. ప్రతి సంవత్సరం జరిపే సీతారాముల కల్యాణం రోజున రాముడు, సీత, లక్ష్మణుడి విగ్రహాలను పట్టుకొని వచ్చేవారు. ఆ విగ్రహాలను పట్టుకున్నట్లు పూజారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నాం." - లక్ష్మణాచార్యులు, శ్రీరంగాచార్యుల కుమారుడు

బాల రాముడి విగ్రహ ఎంపిక పూర్తి!- 35అడుగుల దూరం నుంచే భక్తులకు దర్శన భాగ్యం

ప్రథమ వర్ధంతి రోజే విగ్రహ ప్రతిష్ఠాపన : ప్రజలంతా ఏకమై కుటుంబ సభ్యుల సహకారంతో పైసా పైసా పోగుచేసి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి గుడి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఆయన ప్రథమ వర్దంతి రోజైన గురువారం నాడు విగ్రహా ప్రతిష్ఠాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని పూజారి కుమారుడు తెలిపారు. సీతారాముల విగ్రహాలతో నిలిచిన ఆయన నిలువెత్తు విగ్రహాన్ని చాలా సుందరంగా రూపొందించారు గ్రామస్థులు. పెద్దాయన చేసిన సేవకే ఇలా చేసామని భౌతికంగా ఆయన లేకపోయినా తమకళ్ల ముందు ఎప్పుడూ ఉంటారని గ్రామస్థులు చెబుతున్నారు.

"ఏదో ఒక రూపంగా ఆయన మాకు చేసిన సేవలకు ప్రతిఫలంగా పూజారి విగ్రహం ఏర్పాటు చేశాం. దేవస్థానం భూమి ఉంది. ఆ స్థలంలో విగ్రహంతో చిన్న గుడి కట్టాలని నిర్ణయించాం. వైద్య వృత్తి చేస్తూ అందరికీ ఉచితంగా సేవలు అందించారు. చుట్టు ప్రక్కల గ్రామాలకు 24 గంటలు అందుబాటులో ఉండేవారు. మంచి వైద్యం చేసేవారు. అందరిని కలుపుకొని వెళ్లేవారు. ఒక పూజారికి గుడి కట్టడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి." - తాటికొండ గ్రామస్థులు

మండలపూజలు పూర్తి- శబరిమల గుడి మూసివేత- మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే?

100 ఏళ్లుగా శునకానికి పూజలు- ఆ విగ్రహానికి మొక్కితే కోరికలు తీరుతాయట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.