లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీలు పడుతున్న కష్టాలు అందరికి తెలిసిందే. ప్రభుత్వం శ్రామిక్ రైళ్లు అందుబాటులోకి తెచ్చినా అవి జనగామ లాంటి ప్రాంతాల్లో అందుబాటులో లేకపోవడం వల్ల తమ స్వగ్రామానికి వెళ్లడానికి వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఇది గుర్తించిన పోలీసులు 44 మంది వలసకూలీలను పంపించేందుకు ఏర్పాటు చేశారు. అధికారుల అనుమతి తీసుకుని. చర్లపల్లి నుంచి బయలుదేరుతున్న శ్రామిక్ రైలులో ఎక్కించేందుకు ఏర్పాట్లు చేశారు.
జనగామ నుంచి బస్సులో చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు తరలించారు. వారికి దారిలో తినడానికి అవసమయ్యే బిస్కెట్లు, అరటిపండ్లు, నీళ్ల బాటిళ్లతో పాటు, మాస్కులు, శానిటైజర్లను అందించి, ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి పంపించారు. వలస కూలీలు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.