ETV Bharat / state

"పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు ఉంటుంది" - zp chairman of janagama district

జనగామ జిల్లా పరిషత్​ తొలి పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. జడ్పీ ఛైర్మన్​గా పాగాల సంపత్​రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రి ఎర్రబెల్లి, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హాజరయ్యారు.

"పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు ఉంటుంది"
author img

By

Published : Jul 5, 2019, 7:41 PM IST

"పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు ఉంటుంది"

జనగామ జిల్లా జడ్పీ ఛైర్మన్​గా పాగాల సంపత్​రెడ్డి, వైస్​ ఛైర్​పర్సన్​గా భాగ్యలక్ష్మీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఎర్రబెల్లి, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హాజరయ్యారు. కొత్తపాలకవర్గాలపై బృహత్తర బాధ్యతలున్నాయని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు దక్కుతుందని హామీ ఇచ్చారు. నూతన పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు.

tg_wgl_61_05_zp_chirmen_pramanaswikaram_ab_ts10070 contributor: nitheesh, janagama. ........................................................................................................ ( )జనగామ జిల్లా ప్రజా పరిషత్ తొలి పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జనగామ జిల్లా తొలి జడ్పీ చైర్మన్ గా పాగాల సంపత్ రెడ్డి, వైస్ చైర్మన్ గా గిరాబోయిన భాగ్యలక్ష్మి, జడ్పీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసనమండలి విప్ లు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పాల్గొని నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని పిలుపునిచ్చారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ...కొత్త పాలకవర్గాల పై బృహత్తర బాధ్యతలు ఉన్నాయని అన్నారు. సంపత్ రెడ్డికి పదవి ఇవ్వడంతో ఉద్యమకారులకు మరోసారి గుర్తింపు దక్కిందని పేర్కొన్నారు. పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు దక్కుతుందని చెప్పారు. కార్యకర్తలకు గుర్తింపు నిచ్చెలా సీఎం కేసీఆర్ నిర్ణయాలు ఉంటాయని అన్నారు. ప్రతి ఇంటికి నల్లా తో మంచినీళ్లు అందిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. పెరిగిన ఆసరా పెన్షన్ల మొత్తాన్ని అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. జనగామ జిల్లా అభిృద్ధికి సమష్టిగా కృషి చేస్తామని అన్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పదవికి గౌరవం తేవాలని సూచించారు. జెడ్పీ చైర్మన్ పగాల సంపత్ రెడ్డికి, వైస్ చైర్ పర్సన్ జి.భాగ్యలక్ష్మి కి, జెడ్పీటీసీ లకు, ఎంపిపిలకు, ఎంపిటిసి లకు అభినందనలు తెలిపారు.అంతకుముందు హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.