జనగామ జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. జిల్లా కేంద్రంలోని ఓ దుకాణ యజమానికి వైరస్ నిర్ధరణ అయినట్లు జిల్లా వైద్యాధికారి మహేందర్ తెలిపారు. బాధితుడిని హోం క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అతనితో సన్నిహితంగా ఉన్న మరో నలుగురు సహా యజమానులను కూడా హోం క్వారంటైన్‌కు తరలించామని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 12 కేసులు నమోదయ్యాయి. 10 మంది కోలుకుని డిశ్చార్జి కాగా... ఒకరు మృతి చెందారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో ఐదు వేలకు చేరువలో కరోనా కేసులు