జనగామ జిల్లా బచ్చన్న పేట మండలం రామచంద్రాపూర్‌కు చెందిన బాలసిద్దులు పెళ్లి పనుల కోసం బచ్చన్నపేట వెళ్లి వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిన ఘటనలో అక్కడికక్కడే మృతిచెందాడు.
పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో మరణవార్త బంధువులను కలిచివేసింది. ఈరోజు మృతుడి కుమార్తె పెళ్లి జరగాల్సి ఉండగా... అంతలోనే ఈ దుర్ఘటన జరిగింది. పెళ్లి పెద్ద మృతితో... కుటుంబసభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇవీచూడండి: జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రైళ్ల క్రమబద్ధీకరణ