ములుగు జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి ములుగు ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతదేహానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియకపోవడం వల్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి: ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి