18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని... జనగామ కలెక్టర్ కే.నిఖిల సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ప్రజాస్వామ్య దేశానికి ఓటే వజ్రాయుధమని అన్నారు.
ఓటు హక్కుపై అవగాహన పెంచేలా గ్రామాల్లోని బీఎల్ఓలు కృషి చేయాలన్నారు. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీగా వినియోగించుకోవాలని అధికారులు, ఓటర్లతో ప్రమాణం చేయించారు.
ఇదీ చదవండి: ఈ-ఓటరు గుర్తింపు కార్డును ఆవిష్కరించిన ఎస్ఈసీ