ముక్కోటి ఏకాదశి వేడుకలు జనగామ జిల్లాలో ఘనంగా జరిగాయి. జిల్లాలోని పలు ఆలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల నిర్వాహకులు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెల్లవారుజాము నుంచే ..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే పూజలు మొదలయ్యాయి. భక్తులు ఉదయం 5 గంటల నుంచే బారులు తీరి తమ భక్తిప్రపత్తులను ప్రదర్శించారు. ప్రత్యేక పూజలు, ధనుర్మాస అర్చనలు, విష్ణు సహస్రనామార్చనలతో ఆలయాలు మారుమోగాయి.
ఇదీ చూడండి: రజినీకాంత్కు అస్వస్థత.. జూబ్లీహిల్స్ అపోలోలో చేరిన సూపర్ స్టార్