జనగామలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంఘీభావం తెలిపారు. కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని.. ఎవరు బలిదానాలకు పాల్పడొద్దని కోరారు. నెల రోజుల ముందే కార్మికులు నోటీసులు ఇచ్చినా.. సర్కారు కాలయాపన చేసిందన్నారు. ఆర్టీసీ ఆస్తులను దోచుకోవడం కోసమే సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: బలిదానాలు లేని తెలంగాణ కావాలనుకున్నాం: నాగం