జనగామ జిల్లా స్టేషన్ఘనపూర్ నియోజకవర్గంలోని చిల్పూర్ మండలంలో ఎమ్మెల్యే రాజయ్య పర్యటించారు. మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం విక్రయించాలని ఎమ్మెల్యే రాజయ్య సూచించారు. వ్యవసాయ అధికారులు ఇచ్చిన టోకెన్ల ఆధారంగా విక్రయించాలని తెలిపారు.
ధాన్యం విక్రయించేటప్పుడు రైతులు, కొనుగోలు చేసేటప్పుడు అధికారులు భౌతిక దూరం పాటించాలని ఎమ్మెల్యే కోరారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కర్షకులు సూచించారు.