ETV Bharat / state

మంత్రాలుంటే నా మీద ప్రయోగించండి: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి - మ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

జనగామ జిల్లా తరిగొప్పుల మండలం పోతారంలో దెయ్యం తిరుగుతుందన్న వార్తలు హల్​చల్​ చేస్తున్నాయి. గ్రామస్థులు గజగజా వణికిపోతున్నారన్న సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆ ఊరికి చేరుకున్నారు. జనవిజ్ఞానవేదిక సభ్యులతో కలిసి మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు.

mla muttireddy yadagiri reddy Raising awareness on superstitions

author img

By

Published : Feb 27, 2021, 1:12 PM IST

ప్రజలు మూఢనమ్మకాలను నమ్మకూడదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సూచించారు. ఆధునిక యుగంలో దెయ్యాలు, మంత్రాలు, చేతబడి లాంటి వాటిని విశ్వసించకూడదన్నారు. మంత్రలే ఉంటే ముందు తన మీద ప్రయోగించాలని... అనంతరం అమాయక ప్రజల వద్దకు వెళ్లాలని యాదగిరిరెడ్డి వ్యాఖ్యానించారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం పోతారంలో దెయ్యం తిరుగుతుందని వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి. ఈ వార్తలకు గ్రామస్థులు భయపడుతూ... ఇళ్లు ఖాళీ చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గ్రామానికి చేరుకున్నారు.

mla muttireddy yadagiri reddy Raising awareness on superstitions
దెయ్యం ఉందన్న ఇంటిని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

జనవిజ్ఞాన వేదిక సభ్యులు, పోలీసులతో కలిసి దెయ్యం తిరుగుతుందని ప్రచారం జరుగుతున్న ఇంటిని పరిశీలించారు. అందరితో కలిసి అక్కడే భోజనం చేశారు.

దెయ్యం ఉందన్న ఇంటి వద్దే భోజనం
అమాయకపు ప్రజలను కొందరు భయాందోళనలకు గురిచేస్తూ... ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మూఢనమ్మకాలను ప్రజలు ధైర్యంతో తిప్పి కొట్టాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సూచించారు.

ఇదీ చూడండి: సిగ్నల్​ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.