రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూ... అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటి కేశ్వపూర్ గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన దేవాదుల కాల్వ ద్వారా మన్సన్పల్లి, సాల్వపూర్, లింగంపల్లి గ్రామాలకు గోదావరి జలాలను విడుదల చేశారు. దేవాదుల కాల్వ నిర్మాణానికి, భూ సేకరణకు సహకరించిన దేవాదుల అధికారులకు, రైతులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండిః రాజధాని శివారులో మహిళా వైద్యురాలి దారుణహత్య