జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పర్యటించారు. పలు వార్డుల్లో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. మురికి కాలువల్లో నిలిచిపోయిన చెత్తను స్వయంగా తొలగించారు. తమ వీధులను తామే శుభ్రంగా చూసుకోవాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే సూచించారు. ఆయా వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేసి ప్రజల మెప్పు పొందాలని ఇచ్చిన సవాలుకు అభ్యర్థులు చేపట్టిన చర్యలను పర్యవేక్షించి... ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు.
ఇదీ చూడండి: అయేషా గోళ్లు, ఎముకలు, కేశాల పరిశీలన