రైతుల సుఖ దుఃఖాలను చర్చించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన రైతు వేదికల నిర్మాణం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. జనగామ జిల్లా నర్మెట్ట మండలంలోని మచ్చుపహాడ్, నర్మెట్ట, హన్మంతాపూర్, వెల్దండ గ్రామాల్లోని రైతు వేదికలను ఆయన ప్రారంభించారు.
మద్దతు ధర, అధిక దిగుబడి వచ్చే పంటలు, పంటకు ఎక్కడ ఎక్కువ ధర వస్తుందో చర్చించుకోవడానికి ఇన్నాళ్లు సరైన వేదిక లేదని పేర్కొన్నారు. రైతుల ఆర్థిక ప్రగతి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్.. రైతు వేదిక భవనాలను నిర్మిస్తున్నారని తెలిపారు. అన్నదాతలందరినీ సంఘటితం చేసి వారికి మేలు చేకూరేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు.
వెల్దండ గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని రాగా.. గోనె సంచులు అందుబాటులో లేవని అధికారులు చెప్పారు. వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఇదీ చదవండి: ఆధార్ వివరాలను ఏరూపంలోనూ సేకరించవద్దు: హైకోర్టు