సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో జరిగింది.
400 సంవత్సరాల క్రితం పేద ప్రజలపై రాజుల దాష్టీకాన్ని ప్రతిఘటించి పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాజులపై పోరాడి 39 కోటలు స్వాధీనం చేసుకున్నాడన్నారు. గోల్కొండ కేంద్రంగా పరిపాలన సాగించిన వీరుడు పాపన్న అని.. దిల్లీ రాజులను గడగడలాడించాడని కొనియాడారు. ఆయన పేద ప్రజలందరి కోసం పోరాటం సాగించాడని గుర్తు చేశారు.
విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వెళుతూ.. మార్గమధ్యలో గీత కార్మికులను కలిశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రులు తాటి కల్లు సేవించారు. కల్లులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని.. ఆరోగ్యానికి మేలు చేస్తుందని అన్నారు. పట్టణాల్లోనూ నీరా దుకాణాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు.
ఇదీ చూడండి: ఏం టేస్ట్ గురూ... కల్లు తాగిన మంత్రులు