ETV Bharat / state

Minister KTR With Jangaon BRS Leaders : జనగామ ఈజ్ క్లియర్.. వాళ్లిద్దరూ కలిసిపోయారు

Minister KTR With Jangaon BRS Leaders : జనగామ ఆశావహులతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్.. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య సయోధ్య కుదిర్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని జనగామ నేతలకు మంత్రి సూచించారు.

Minister KTR With Jangaon BRS Leaders
Minister KTR
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 10, 2023, 3:44 PM IST

Updated : Oct 10, 2023, 7:02 PM IST

Minister KTR With Jangaon BRS Leaders : జనగామ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతివ్వాలని ఆ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్న నేతలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్(Minister KTR) తెలిపారు. ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఇతర ఆశావహుల మధ్య మంత్రి సయోధ్య కుదిర్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమని.. కష్టపడిన నేతలు, కార్యకర్తలందరికీ తగిన అవకాశాలు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చినందుకు కేటీఆర్‌కు పల్లా రాజేశ్వర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Ticket War in Jangaon : బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఖరారు కొలిక్కి వచ్చిన దశలో.. జనగామ రాజకీయం వేడెక్కింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి జనగామ టికెట్‌ను ఆశిస్తున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా అంతర్గతంగా ఉన్న నేతల మధ్య పోటీ.. బహిరంగమయ్యాయి. కొంతకాలంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి బలప్రదర్శనకు దిగుతున్నారు.

MLA Mutthireddy Fires On MLC Palla Rajeswerreddy : 'పల్లా రాజేశ్వర్​ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి'

Jangaon BRS Ticket Issue : తనపై రాజకీయంగా కుట్రలు జరుగుతున్నాయని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పలు ఆరోపణలు చేస్తూ వచ్చారు. నియోజకవర్గంలో కార్పొరేట్ పద్ధతిలో కుట్రలు చేస్తూ.. పల్లా రాజేశ్వర్​రెడ్డి తన బిడ్డను, అల్లుడిని రెచ్చగొట్టారని ఫైర్ అయ్యారు. ఏనాడూ జనగామ ప్రజలను ఆదుకోలేని వ్యక్తి.. ఈనాడు పార్టీకి ఇబ్బందిగా మారారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం జనగామ అసెంబ్లీ టికెట్‌(BRS Jangaon Assembly Ticket) తనకే కేటాయించిందని ప్రచారం చేస్తూ.. కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో రాజకీయంగా ఓడించలేక.. తన ఇంట్లో చిచ్చు పెట్టారని ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా.. జనగామ అసెంబ్లీ టికెట్ పల్లాకే ఖరారైందన్న ప్రచారంతో.. నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయాయి. అయితే తాజాగా మంత్రి కేటీఆర్ ముత్తిరెడ్డి యాదిగిరి రెడ్డి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి మధ్య సయోధ్య కుదిర్చారు. అలాగే జనగామ ప్రజలకు సైతం జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లాను గెలిపించాలని కోరారు.

TSRTC New Chairman MLA Muthireddy Yadagiri Reddy : మరోవైపు జనగామ ఎమ్మెల్యే టికెట్‌ను సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కాకుండా పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ముత్తిరెడ్డిని బుజ్జగించడానికి.. ఆర్టీసీ ఛైర్మన్‌ పదవిని ఆయనకు కట్టబెట్టారు. దీంతో ముత్తిరెడ్డి యాదిగిరి రెడ్డి రెండు రోజుల క్రితం టీఎస్‌ఆర్టీసీ నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

BRS Assembly Elections Plan 2023 : ఎన్నికల బరిలోకి సీఎం కేసీఆర్​.. రోజుకు 3 బహిరంగ సభలు.. 100 నియోజకవర్గాలు టార్గెట్

KTR Respond to Election Schedule : 'తెలంగాణలో ఎన్నిక ఏకపక్షమే..! భారీ విజయం.. బీఆర్‌ఎస్‌దే..!'

Last Updated : Oct 10, 2023, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.