పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. శనివారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నాలుగు వందల మంది రైతులకు మినీ డైరీ కేంద్రాలను మంజూరు చేస్తూ ధ్రువపత్రాలను అందజేశారు.
అంతకు ముందు ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశ పెట్టి పేదలను ఆదుకుంటున్నారని కొనియాడారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: అశ్రునయనాలతో బాలూకు అంతిమ వీడ్కోలు