ETV Bharat / state

రైతును రాజుగా చూడాలన్నదే ప్రభుత్వ సంకల్పం: మంత్రి ఎర్రబెల్లి

జనగామ జిల్లా మంచుప్పల గ్రామంలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పాల్గొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే.. సీజనల్​ వ్యాధులు మన దరికి చేరవని.. గ్రామాలన్నీ పరిశుభ్రంగా మార్చేందుకే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టామని తెలిపారు.

Minister Errabelli Dayakar Participated In  Palle Pragathi
పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
author img

By

Published : Jun 5, 2020, 5:05 PM IST

రైతును రాజుగా చూడాలన్న సంకల్పంతోనే ముఖ్యమంత్రి నియంత్రిత పంట సాగు విధానం అమలు చేస్తున్నారన్నారు పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు. జనగామ జిల్లా పాలకుర్తి మండల పరిధిలోని మంచుప్పల గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామంలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే.. సీజనల్​ వ్యాధులు మన దరికి రావన్నారు. ఎవరైనా బహిరంగంగా చెత్త వేస్తే.. వెంటనే రూ. 500 జరిమానా వేయాలని అధికారులను ఆదేశించారు.

ఒకసారి జరిమానా విధించిన తర్వాత కూడా మళ్లీ చెత్త వేస్తే.. రెండోసారి రూ. 5000 జరిమానా వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్​ నిఖిల, జడ్పీ ఛైర్మన్​​ సంపత్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవీచూడండి: మహారాష్ట్రలో రికార్డు స్థాయి కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.