కరోనా కట్టడిలో పారిశుద్ధ్య కార్మికులది ముఖ్యమైన పాత్రని, ఇంతమంది ఆరోగ్యాలను కాపాడుతున్న వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని జనగామ జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు. జనగామ మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు జిల్లా వైద్య సిబ్బందితో వైద్య పరీక్షలు నిర్వహించారు.
అనంతరం వారికి కావాల్సిన మందులు, మాస్కులు, శానిటైజర్లు, సబ్బులు, కొబ్బరి నూనె, చేతి తొడుగులను మున్సిపల్ ఛైర్పర్సన్ జమునతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మహేందర్ రెడ్డి, సూపరింటెండెంట్ రఘు, ఆర్ఎంవో సుగుణాకర్ రాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: వలస కూలీల్లో కరోనా... ఉలిక్కిపడ్డ గ్రీన్‌జోన్