ETV Bharat / state

చెల్లిని ప్రేమిస్తున్న యువకుడిని చంపిన అన్న - జనగామ జిల్లా తాజా వార్తలు

తన సోదరిని ప్రేమిస్తున్న ఓ యువకుడిపై యువతి సోదరుడు దాడి చేసిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడిని ఆటోతో ఢీకొట్టి... కత్తితో దాడి చేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

jangaon latest news
చెల్లిని ప్రేమిస్తున్న యువకుడిని చంపిన అన్న
author img

By

Published : May 22, 2020, 9:05 PM IST

Updated : May 23, 2020, 12:06 AM IST

చెల్లిని ప్రేమిస్తున్నాడని ఓ యువకుడిపై యువతి సోదరుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. జనగామ జిల్లా బచ్చనపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన శ్రీధర్ కొంత కాలంగా... కోడవటూర్​కు చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు.

విషయం తెసుకున్న యువతి సోదరుడు శివకుమార్​... తన చెల్లి వెంటపడొద్దంటూ శ్రీధర్​కు పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ శ్రీధర్​ వినకపోవడం వల్ల... హతమార్చేందుకు పథకం వేశాడు. ద్విచక్రవాహనంపై బచ్చన్నపేటకు వెళ్తున్న శ్రీధర్​ను కొడవటూర్​ కమాన్​ వద్ద ఆటోతో ఢీ కొట్టాడు. కిందపడిపోయిన శ్రీధర్​పై కత్తితో దాడిచేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడిన యువకుడిని జనగామ ఆస్పత్రికి తీసుకెళ్లగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు. హత్యకు పాల్పడిన శివకుమార్​ పోలీసులు సమక్షంలో లొంగిపోయినట్లు సమాచారం. డీసీపీ శ్రీనివాస్​ రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

చెల్లిని ప్రేమిస్తున్న యువకుడిని చంపిన అన్న

ఇదీ చూడండి : మృతదేహాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

Last Updated : May 23, 2020, 12:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.